ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేయకుండానే..సదరు ఫాలోవర్‌ను తొలగించొచ్చు. అది ఎలా అంటే.. మీ టైమ్‌లైన్, ట్వీట్స్‌ను ఎవరైనా వ్యక్తులు, యూజర్లు చూడకూడదు అనుకున్నట్లయితే ఈ ఫీచర్‌ను వినియోగించి వారికి మీ ట్వీట్స్ కనిపించకుండా చేయొచ్చు.
ఇప్పటి వరకు తాము చేసే ట్వీట్లు, తమ ప్రొఫైల్ పిక్చర్ తమకు నచ్చని వ్యక్తులకు కనిపించకుండా ఉండాలంటే వారిని బ్లాక్ చేయాల్సి ఉండేది. అయితే, కొందరు బ్లాక్ చేయడానికి ఇష్టపడరు. కానీ తమ ఫీడ్ మాత్రం వారికి కనిపించొద్దని భావిస్తుంటారు. అలాంటి వారికి ఈ ఫీచర్ అద్భుతంగా ఉపకరిస్తుందని చెప్పాలి. ‘సాఫ్ట్ బ్లాకింగ్’ పేరుతో తీసుకువచ్చిన ఈ ఫీచర్ ద్వారా ఫాలోవర్స్‌పై ట్విట్టర్ యూజర్ గ్రిప్ పొందవచ్చు. అంటే ఈ ఫీచర్ ద్వారా ట్రోలింగ్ నుంచి తప్పించుకోవడం, ప్రైవసీని కాపాడుకోవడం చేయొచ్చు.
కంప్యూటర్, మొబైల్ యాప్‌లో ట్విట్టర్ అకౌంట్‌కి లాగిన్ అవ్వాలి.
ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్ళి ఫాలోవర్స్ లిస్టును ఓపెన్ చేయాలి.
వద్దు అనుకుంటున్న ఫాలోవర్‌ను ఎంపిక చేసుకుని, పేరు పక్కన ‘త్రీ డాట్ మెనూ’ను టాప్ చేయాలి.
ఆప్షన్స్‌లో ‘రిమూవ్ ద ఫాలోవర్’ని ఎంపిక చేసుకోవాలి.
ఒకసారి ఇలా చేస్తే సదరు ఫాలోవర్ సంబంధిత జాబితా నుంచి మాత్రమే తొలగుతాడు. అప్పటికీ తను ప్రొఫైల్, ట్వీట్స్‌ను చూడగలుగుతారు.
అది కూడా వద్దనుకుంటే మాత్రం ఆ ఫాలోవర్‌ను బ్లాక్ చేయాల్సిందే.