భారత్‌ నుండి ఆస్కార్‌కు పోటీపడ్డ చిత్రాలివే..తెలుగు చిత్ర సీమకు దక్కని చోటు..!

These are the films that competed for the Oscars from India..there is no place for Telugu cinema ..!

0
88

వచ్చే యేడాది జరుగనున్న ఆస్కార్‌ అవార్డ్స్‌ లో ఎంట్రీ కోసం వివిధ భాషల నుండి వచ్చిన సినిమాలను పరిశీలించి మొత్తం 14 చిత్రాలను షార్ట్‌ లిస్ట్‌ చేశారు. ఈ సినిమాలను ఈ నెల 18 నుండి 23 వరకూ ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని 15 మంది జ్యూరీ సభ్యుల కమిటీ వీక్షించి, ‘కూళంగల్‌’ను భారతదేశం తరఫున ఆస్కార్‌ కు అధికారిక చిత్రంగా ఎంపిక చేసింది.

ఈసారి భారత్‌ నుండి ఆస్కార్‌ కు 14 చిత్రాలు పోటీపడ్డాయి.

అవేవంటే.. 1.’షేర్షా (హిందీ), 2.మండేలా (తమిళం), 3.షేర్నీ (హిందీ), 4.ఆట వెల్‌ జాలీ (మరాఠీ), 5.కూళంగల్‌ (తమిళం), 6.కాగజ్‌ (హిందీ), 7.బ్రిడ్జ్‌ (అస్సామి), 8.తూఫాన్‌ (హిందీ), 9.ఛల్లో షో (గుజరాతీ), 10.గోదావరి (మరాఠీ), 11.సర్దార్‌ ఉద్దమ్‌ (హిందీ), 12.కారానిసాంచి వారి (మరాఠీ), 13.నాయట్టు (మలయాళం), 14.లైలా ఔర్‌ సాత్‌ గీత్‌ (గోర్జీ) చిత్రాలున్నాయి.

దేశంలోనే భారీ బడ్జెట్‌ చిత్రాలతో పాటు అత్యధిక చిత్రాలను నిర్మించే తెలుగు చిత్రసీమ నుండి ఒక్క సినిమా కూడా ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌ లో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే కరోనా పేండమిక్‌ సిట్యుయేషన్‌ కారణంగా ఈసారి తక్కువ చిత్రాలు వచ్చాయని, కానీ క్వాలిటీ సినిమాలను చూసి ఒడపోత పోయడానికి తాము ఎంతో మేథోమధనం చేయాల్సి వచ్చిందని కమిటీ ఛైర్మన్‌ షాజీ ఎన్‌ కరుణ్‌ తెలిపారు.