పంట పొలాల్లో గంజాయి కలకలం..

Cannabis scam in crop fields

0
85

గుట్టు చప్పుడు కాకుండా పొలంలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు పట్టణ పోలీసులు ప్రత్యేక బృందాల ద్వారా గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై దృష్టిసారించారు.

జగిత్యాల బీట్ బజార్ కు చెందిన అరుముళ్ల సాయికుమార్, ఆసిఫాబాద్ లింగాపూర్ గ్రామానికి చెందిన చందు గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. గంజాయి మొక్కలతో పాటు మూడు బైక్‌లను సీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

తెలంగాణ రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరా, స్మగ్లింగ్‌ను నియంత్రించేందుకు పోలీస్‌ శాఖ, ఎక్సైజ్‌ విభాగాలు నడుం బిగించాయి. ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తున్నాయి. కొద్దీ రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ పోలీస్, ఎక్సైజ్‌ విభాగాలతో గంజాయి నియంత్రణపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు.