నీరు శరీరానికి ఎంత అవసరమో అందరికి తెలుసు. ఆహారం లేకపోయినా కొద్ది రోజులు ఉండగలం. కానీ నీరు లేకపోతే బ్రతకడం కష్టం. అందుకే రోజు ఎన్ని లీటర్ల నీరు తాగుతున్నారో చెక్ చేసుకోవాలి. అంతేకాదు నీరు ఏ పద్దతిలో తాగుతున్నారనేది కూడా చాలా ముఖ్యం. చాలా మంది నిలబడి నీళ్లు తాగుతారు. అయితే ఇది మంచి పద్దతి కాదు. నీటిని ఎప్పుడైనా సరే ప్రశాంతంగా కూర్చొని తాగాలి. నిలబడి నీళ్లు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నిలబడి నీళ్ళు తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. తాగిన నీళ్లు వేగంగా వెళ్లి పొత్తికడుపుపై ప్రభావం చూపుతాయి. ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వల్ల ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల టాక్సిన్స్ పెరుగుతాయి.
కూర్చున్నప్పుడు మన కిడ్నీలు బాగా ఫిల్టర్ అవుతాయని చాలా నివేదికలలో తేలింది. నిలబడి నీరు తాగినప్పుడు నీరు దిగువ పొట్టకు ఎలాంటి వడపోత లేకుండా వెళుతాయి. దీని వల్ల మూత్రాశయంలో నీటి మలినాలు చేరి మూత్రపిండాల పని తీరు దెబ్బతింటుంది. మూత్ర నాళాల రుగ్మతలను కలిగిస్తుంది.
నిలబడి నీటిని తాగినప్పుడు అవసరమైన పోషకాలు, విటమిన్లు కాలేయం, జీర్ణవ్యవస్థకు చేరవు. మీరు నిలబడి నీరు తాగినప్పుడు అవి శరీరంలోకి వేగంగా వెళుతాయి. దీనివల్ల ఆక్సిజన్ స్థాయి చెదిరిపోతుంది. కాబట్టి ఊపిరితిత్తులు గుండె పనితీరును ప్రమాదంలో పడేస్తుంది.
కాబట్టి వీలైనంత వరకు కూర్చుని నీళ్లు తాగడం చేయండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.