సినిమా స్టైల్లో సిద్ధిపేట కలెక్టర్ వార్నింగ్ (వీడియో)

Siddhipet Collector Warning in Cinema Style

0
75

జిల్లా కలెక్టర్ ఎంత హుందాగా ఉండాలో మనం చెప్పక్కర్లేదు. కానీ ఆయన చెలరేగిపోయారు. వ్యవసాయశాఖ సమీక్షలో భాగంగా అధికారులపై తెలంగాణలోని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కోపంతో ఊగిపోయారు. నేను చెప్పిందే ఫైనల్.. జీవో గీవోలాంటివేం ఉండవ్. ఆర్డర్ కూడా ఇయ్యా. ఇది నా హుకుం అంటూ.. ఊగిపోయారు.

నా మాట కాదని ఏదైనా చేశారో ఖబడ్దార్ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఒక్కసారిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఎరువులు, విత్తనాల డీలర్లపై నిప్పులు చెరిగారు. చెండాడుతా… వెంటాడుతా… ఖబడ్దార్ అంటూ అధికారులకు అల్టిమేటం ఇచ్చారు. నాకు తెలియకుండా కిలో వరి గింజలు అమ్మారో అందరినీ సస్పెండ్ చేస్తా.. గుర్తు పెట్టుకోండి అంటూ సినిమా స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు.

ఒక్క ఎకరం కూడా వరి సాగు చేయడానికి వీలు లేదని.. అలా చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు హుకూం జారీ చేశారు. రైతులకు వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవంటూ డీలర్లకు హెచ్చరించారు. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై అధికారులు, విత్తనాలు, ఎరువుల డీలర్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు.