తెలంగాణ: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మురుగన్ పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పత్తిని హాట్‌బాక్స్‌లో డంపింగ్ చేస్తుండగా..ఈ ఘటన సంభవించింది. అక్కడే ఉన్న వాళ్లు.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
హుటాహుటిన పత్తి మిల్లుకు చేసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు ఆర్పుతున్నారు. ఈ ఘటనలో పత్తి మిల్లులోని సుమారు 600 క్వింటాళ్లకు పైగా పత్తి దగ్ధమైనట్టు అంచనా వేస్తున్నారు.