తెలంగాణ: వికారాబాద్ జిల్లాలోని పరిగి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. పెట్రోలు పోసుకుని ఐదుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు. తమపేరు మీద వారసత్వ భూమిని నమోదు చేయలేదని ఆరోపించారు. వారసత్వ భూమి నమోదు చేయడంలో అలసత్వం చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబం…పెట్రోల్‌తో వచ్చారు. ఐదుగురు సభ్యులు పెట్రోల్ వేసుకోగా స్థానికులు వారిని అడ్డుకున్నారు.