Flash News- జమ్మూ కశ్మీర్‌‌లో ఘోరం..11 మంది మృతి

0
74

జమ్మూ కశ్మీర్‌‌లో ఘోరం చోటు చేసుకుంది. ధాత్రి నుంచి దోడాకు వెళ్తున్న మినీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోగా..పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తోంది.

గాయపడిన వారిని దోడాలోని హాస్పిటల్‌‌కు తరలించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేల సాయం అందించనున్నట్లు తెలిపారు.