అంతేకాదు ఇది కంటి చూపును, జుట్టుని, మెదడు పనితీరు మెరుగుపర్చడంలో ఉపయోగపడుతుంది. సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్ మెరుగుపరిచి రక్తహీనతను నివారిస్తుంది. సీతాఫలం క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. సీతాఫలం లో-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా సీతాఫలం తినవచ్చు.
ఇంకా సీతాఫలం బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఔషధంగా చెప్పొచ్చు. కాకపొతే, ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది కనుక మోతాదుకి మించి సీతాఫలాలు తీసుకోకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది. అధిక రక్తపోటును తగ్గించడంలోనూ సీతాఫలం ఎంతో మంచిది.