మీ శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా..ఎందుకో తెలుసా?

Do you see these changes in the body ..?

0
86

మనిషి బతకడానికి గాలి ఎంత అవసరమో నీరు కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే తగిన నీటిని తీసుకోవాలి. మనిషికి వచ్చే చాలా వరకు వ్యాధులు సరిపడ నీటిని తీసుకోకపోవడం వల్లే వస్తాయని వైద్యులు చెబుతుంటారు. ఒక్క రెండు రోజులు శరీరానికి సరిపడ నీటిని తీసుకోకపోతే దాని తాలుకూ రియాక్షన్స్‌ బాడీలో కనిపిస్తాయి. మరి రోజూ తగిన మోతాదులో నీటిని తాగకపోతే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరానికి సరిపడా నీరు అందకపోతే డీహైడ్రేషన్‌ బారిన పడుతాం. శరీరం ఈ స్థితికి వెళితే విపరీతమైన ఆకలి, తీవ్ర తలనొప్పి, కాళ్లు చేతులు లాగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. శరీరానికి సరిపడ ద్రవాలు అందకపోతే నోరు తడారిపోతుంది. దీంతో నోట్లో బాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఫ‌లితంగా నోటి దుర్వాసన వ‌స్తుంది. ఇలా జ‌రుగుతుందంటే నీళ్లను ఎక్కువ‌గా తాగాల్సి ఉంటుంది.

శరీరంలో రక్తసరఫరా సరిగ్గా జరగడంలో నీరు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి అవసరమైన నీరు అందకపోతే రక్త సరఫరా సరిగ్గా జరగదు దీంతో శ‌రీర భాగాలు, క‌ణాల‌కు ర‌క్తం స‌రిగ్గా అంద‌దు. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా కూడా త‌గ్గుతుంది. దీంతో త‌ల‌తిర‌గ‌డం, విపరీతమైన తల పోటు వస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మీరు సరిపడ నీటిని తాగట్లేదని అర్థం చేసుకోవాలి.

చూశారుగా సరిపడ నీరు అందకపోతే శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో. కాబట్టి ఇవి కనిపించిన వెంటనే రోజూ వారి నీటి మోతాదును పెంచుకోవాలి. నీరు సరిపడా తాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.