దేశంలో రోజు వారి కరోనా కేసులు సంఖ్య తగ్గుదల నమోదైంది. కొత్తగా 14,348 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి మరో 805 మంది ప్రాణాలు కోల్పోగా..13,198 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా గురువారం 12,84,552 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు జరిపిన పరీక్షల సంఖ్య 60,57,82,957కు చేరినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 4,75,515 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కొవిడ్ ధాటికి మరో 7,855 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,62,46,206 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,95,925కు పెరిగింది.
అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 78,460 మందికి వైరస్ సోకగా.. మరో 1,208 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో కొత్తగా 40,096 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజే 1,159 మంది చనిపోయారు. జర్మనీలో కొత్తగా మరో 26,610 మందికి కొవిడ్ సోకింది. 122 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా మహమ్మారి కొత్త రూపు ధరించి విరుచుకుపడుతున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటకలో ఏడుగురికి ఏవై.4.2 రకం కరోనా వేరియంట్ సోకినట్లు తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై..వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టారు.