సూపర్ స్టార్ రజినీకాంత్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించారు. మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ను గుర్తించిన వైద్యులు.. అవసమైన ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. త్వరలోనే రజినీకాంత్‌ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు కావేరి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. శుక్రవారం ఆయనకు సర్జరీ(కారోటిడ్ ఆర్టరీ రివాస్కులైజేషన్) చేశాం. ప్రస్తుతం ఆయన క్రమంగా కోలుకుంటున్నారు” అని కావేరి ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్. అరవిందన్ సెల్వరాజ్ తెలిపారు.
రజినీ లెటెస్ట్ మూవీ అన్నాత్తే.. తెలుగులో పెద్దన్నగా వస్తోంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. నవంబర్ 4న రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.