హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియలో కౌశిక్ రెడ్డికి షాక్!

Shock to Kaushik Reddy in Huzurabad by-election process!

0
72
Kaushik Reddy

తెలంగాణ: హుజూరాబాద్ నియోజకవర్గం ఘన్ముక్లలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెరాస శ్రేణులతో కలిసి మరోసారి ఘన్ముక్లకు కౌశిక్‌రెడ్డి రాగా..కౌశిక్‌రెడ్డిని భాజపా శ్రేణులు అడ్డగించాయి. మళ్లీ మళ్లీ ఎందుకు వస్తున్నారంటూ భాజపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్థానికేతరులు ఎందుకు వచ్చారని భాజపా నేతలు నిలదీశారు. కౌశిక్‌రెడ్డికి వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు నినాదాలు చేశారు. కౌశిక్‌రెడ్డి దౌర్జన్యానికి యత్నిస్తున్నారంటూ ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ఘన్ముక్లలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌నంటూ కౌశిక్‌రెడ్డి తన ఐడీ కార్డు చూపించారు. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు తనకు హక్కు ఉందని అన్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితులతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. తెరాస నేత కౌశిక్‌రెడ్డికి పోలీసు సిబ్బంది రక్షణగా నిలిచారు.