దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమానుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్‌గా మారిపోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తుండగా..గిరిజన వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి గ్లింప్స్‌ను నవంబర్ 1న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు.
ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదీన విడుదల చేయనున్నారు. మొదటి సింగిల్ ‘దోస్తీ’ ప్రేక్షకులను అలరించాయి. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ శరణ్ వంటి పలువురు ప్రముఖులు ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ నిన్ననే విడుదల చేయాల్సి ఉంది. అయితే దానిని వాయిదా వేశారు మేకర్స్. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కారణంగా విడుదల చేయాల్సిన గ్లింప్స్‌ను వాయిదా వేశారు.