తెలంగాణ: హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. వీణవంకలో ఓటర్లు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే పోలింగ్ సెంటర్ వద్దకు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. మధ్యాహ్నం 1 గంట వరకు 45.63 శాతం పోలింగ్ నమోదు అయింది. మొత్తం ఓట్లు 236873 కాగా ఇప్పటి వరకు 108082 ఓట్లు పోల్ అయ్యాయి. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని వసతులు కల్పించారు. హెల్త్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.
జమ్మికుంట పట్టణంలో 28వ వార్డ్ టీఆర్ఎస్ కౌన్సిలర్ దీప్తి డబ్బులు పంపిణీ చేస్తున్నారని బిజేపి కార్యకర్తలు ఇంటి ముందు బైఠాయించారు.
మండలాల వారీగా ఎన్నికల పోలింగ్ శాతం ఇలా..
కమలాపూర్ -46.76
ఇల్లందు కుంట-42.09
వీణవంక -47.65
జమ్మికుంట – 45.36
హుజురాబాద్ -45.05
45.63