ముగిసిన బద్వేలు ఉపఎన్నిక పోలింగ్‌

0
74

ఏపీలోని బద్వేల్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. పోలింగ్‌ సందర్భంగా అక్కడక్కడ చిన్న పాటి ఘర్షణలు తప్ప మొత్తం మీద ప్రశాంతంగా పోలింగ్‌ ముగిసింది. సమయం ముగిసినా క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు.

సాయంత్రం 5 గంటల వరకు 59.58 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ నియోజకవర్గంలో 2,15,292 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బరిలో అధికార వైసీపీ సహా 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నవంబర్‌ 2న ఫలితం వెలువడనుంది.