తమిళనాడు సీఎంగా అధికారం చేపట్టినప్పటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్న స్టాలిన్. తమిళనాడులో తమ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరూ ఊహించని విధంగా తన పాలనను కొనసాగిస్తున్నారు. ఎవరి అంచనాలకు అందని నిర్ణయాలతో ప్రజల్లో తన క్రేజ్ ను పెంచుకుంటున్నారు సీఎం స్టాలిన్.
తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సముదాయంలో ఉన్న భోజనశాలను మూయించి వేశారు. ఇక నుంచి అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు వారి వారి ఇంటి నుంచే భోజనాలు తీసుకు రావాల్సి ఉంటుంది.