హుజురాబాద్‌, బద్వేల్‌లో మొదలైన ఓట్ల లెక్కింపు..తొలి రౌండ్ ఫలితం ఎప్పుడంటే?

Counting of votes in Huzurabad, Badwell etc. When is the first round result ..

0
72

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా మారిన హుజురాబాద్‌, బద్వేల్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైపోయింది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు స్టార్ట్‌ అయింది. హుజురాబాద్‌ ఓట్ల లెక్కింపు కరీంనగర్‌ SRR డిగ్రీ కాలేజీ దగ్గర టెన్షన్‌ కొనసాగుతోంది. మొత్తం 753 పోస్టల్‌ బ్యాలెట్లు ఉన్నాయి.  ఉదయం 9.30 వరకు తొలి రౌండ్ ఫలితం వచ్చే అవకాశాలున్నాయి.

ఇటు బద్వేల్‌ లో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం నాలుగు హాళ్లలో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. కొన్ని చోట్ల 12 రౌండ్స్‌వరకూ వెళ్లే ఛాన్స్ ఉందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.