హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పసికందుపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే గోల్కొండ రిసాల బజార్ కు చెందిన ఏడాదిన్నర చిన్నారి ఇంటి సమీపంలో ఆడుకుంటుంది. కొద్దిసేపటికే అక్కడ ఆ చిన్నారి కనిపించలేదు. దీనితో చిన్నారి తల్లిదండ్రులు వెతకడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఆ చిన్నారి ఏడ్చుకుంటూ రావడాన్ని చిన్నారి అమ్మమ్మ చూసింది.
చిన్నారిని అడిగితే ఏమి చెప్పకపోవడంతో అనుమానమొచ్చి చూడగా బాలికకు రక్తస్రావం అయింది. అత్యాచారం జరిగిందని అమ్మమ్మ ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం నీలోఫర్ హాస్పిటల్ కు తరలించారు.