హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా ఓట్లు లెక్కింపు కొనసాగుతుంది. ఉపఎన్నికల ఫలితాలలో బీజేపీ జోరు కొనసాగుతోంది. ఫలితాల్లో రౌండ్ రౌండ్‌కు బీజేపీ దూసుకుపోతోంది. 15వ రౌండ్ తరువాత ఈ సంఖ్య మరింత పెరిగింది. తాజాగా 16వ రౌండ్ లో ఈటల జోరు కొనసాగింది. 16వ రౌండ్ లో 1712 ఓట్ల ఆధిక్యం వచ్చింది. అయితే కాసేపట్లో కౌంటింగ్ సెంటర్ కు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రానున్నారు. అటు ఈటెల రాజేందర్ సొంత మండలం కమలాపుర్ లోని ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది.
హుజురాబాద్ అప్డేట్స్
16వ రౌండ్ ముగిసే సరికి బీజేపి లీడ్: 13,255
16వ రౌండ్ ఓట్ల లెక్కింపు….
బీజేపీ : 5689 (74,175)
టిఆర్ఎస్: 3917 (60,920)
బీజేపీ లీడ్ : 1712