యావత్ తెలంగాణే కాదు, పొరుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్‌లలో టీఆర్‌ఎస్‌కు 503, బీజేపీ 159, కాంగ్రెస్ 32 ఓట్లు సాధించగా, చెల్లనివి 14గా ఉన్నాయి. మొత్తంగా పోస్టల్ బ్యాలెట్‌లలో టీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించింది.
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీను సొంత గ్రామం హిమ్మత్ నగర్ లో ఈటలకు 191 ఓట్లు మెజారిటీ వచ్చింది. దీనితో శ్రీనుకు షాక్ తప్పలేదు. ఒకటి రెండు రౌండ్లలో వెనుకంజ వేసినా..మిగిలిన అన్ని రౌండ్లలలోనూ ఈటల హవా కొనసాగుతోంది.
ఇప్పటివరకు రౌండ్స్ వారీగా మెజారిటీ వివరాలు ఇలా ఉన్నాయి.
బీజేపీ – తెరాసా = మెజారిటీ.
1: 4610 – 4444= 166.
2: 4851-4659 =192. (358)
3: 4064-3159= 905 (1263)
4: 4444-3882=562(1825)
5: 4358 – 4014 = 344. (2169)
6: 4656-3639 =1017(3186)
7: 4038 – 3792 = 246. (3432)
8: 4086 – 4248 = 162 TRS. (3270)
9: 5305 – 3470 = 1835. (5105)
10: 4295 – 3709 = 586. (5691)
11: 3941 – 4326 = 385 TRS. (5306)
12: 4849-3632 =1217(6523)
13: 4846-2971=1865(8388)
14: 4746-3700=1046(9434)
15: లీడ్ 2149
Total lead : 11583
ఇంకా ఇల్లందకుంట, కమలా పూర్ కౌంటింగ్ జరగాల్సి ఉంది.