ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

Two killed in AP road accident

0
84

విశాఖ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాడేరు మండలం గొందురు వద్ద హోండా యాక్టివా (స్కూటర్) ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు కీల్లో అప్పలస్వామి కాగా జీకే వీధి మండలంలో జూనియర్అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.

రెండో మృతుని పేరు కుర్తాడి శంకర్ రావు, పెదబయలు మండలం పరెడ పంచాయితీ గూడెం మండలంలో వాల్ ఎంట్రీగా విధులు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.