ఫ్లాష్- పోలీస్ శాఖలో గంజాయి కలకలం..పట్టుబడిన కానిస్టేబుళ్లు

Cannabis arrested in police department

0
68

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు, రవాణా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. పోలీసుల కళ్లుగప్పి వివిధ మార్గాల్లో యథేచ్ఛగా గంజాయి రవాణా అవుతోంది. ఈ క్రమంలో గంజాయి సాగు, అక్రమ రవాణా వెనక రాజకీయ నేతలు, అధికారుల ప్రోత్సాహం ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలకు మరింత బలాన్నిస్తూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కొందరు కానిస్టేబుళ్లు గంజాయిని విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ సంఘటన రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.

రెండు రోజుల క్రితం గంజాయి అమ్ముతూ రాంబాబు అనే వ్యక్తి ఖమ్మం ఎక్సైజ్ పోలీసులకు చిక్కాడు. అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. రాంబాబు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఖమ్మం అర్బన్‌ పోలీసులు, ఎక్సైజ్‌ పోలీసులు సంయుక్తంగా డికాయ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ లో 5 కిలోల గంజాయితో ఖమ్మం ఏఆర్‌ కానిస్టేబుల్ సతీష్ రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టుబడ్డాడు. అతనితో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న వెంకట్ కూడా గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్నట్లు ఈ ఆపరేషన్‌లో తేలింది.