Flash- సీఎం సభ కోసం దౌర్జన్యం..ఉద్రిక్త పరిస్థితి

0
84

హన్మకొండలోని హసన్ పర్తి మండలం దేవన్నపేట రైతుల పొలాల్లో అధికార పార్టీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ సభ నిర్వహణ కోసం రైతుల పొలాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు ఒత్తిడి చేసినట్లు రైతులు తెలిపారు. మీ మీటింగ్ కోసం పంట పాండే తమ పొలాలను ఎట్టి పరిస్థితిలో ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పడంతో రెచ్చిపోయిన టీఆర్ఎస్ నాయకులు భూమి ఎలా ఇవ్వరో మేమూ చూస్తామని హెచ్చరించారు. దాంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట జరిగింది. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.