భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన సమంత..కారణం అదేనా?

Samantha is the reason for the huge increase in remuneration ..?

0
97

టాలీవుడ్ నటి సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం తీసుకున్నట్లు కనిపిస్తోంది. నాగచైతన్యతో విడాకులు అయినప్పటి నుంచి వరుసగా పర్యటనలు, యాత్రలకు వెళుతోంది. ఇప్పటికే ఆమె నటించిన ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తిచేసుకోగా..మరికొన్ని ప్రాజెక్టులు లైనప్​లో ఉన్నాయి. వాటితో పాటు కొత్త సినిమాలకూ ఓకే చెబుతోంది.

తాజాగా సినీ వర్గాల చెబుతున్న దాని ప్రకారం సామ్.. ఒక్కసారిగా భారీగా పారితోషికం పెంచిందట. ఓ సినిమాకు ఏకంగా రూ.3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. ‘శాకుంతలం’తో పాటు సమంత నటించిన ‘కాతువాకుల రెండు కాదల్‌’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు, ‘డ్రీమ్‌ వారియర్స్‌ పిక్చర్స్‌’, శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌లో రెండు సినిమాల చేసేందుకు ఒప్పుకొంది సామ్. మరికొన్ని పాన్ ఇండియా మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.

మరోవైపు దశాబ్ద కాలం నాటి ప్రేమ, నాలుగేళ్ల వివాహబంధానికి స్వస్తి చెబుతున్నట్లు ఇటీవల సమంత-నాగచైతన్య ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే విడిపోవాలనుకుంటున్నట్లు వాళ్లు ప్రకటించారు. ఈ క్రమంలో సామ్‌ ‘అమ్మ చెప్పింది’ అంటూ తన అభిప్రాయాలను పలు సందేశాల రూపంలో తరచూ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తున్నారు.