నేలరాలిన మరో తెలంగాణ నిరుద్యోగి..కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్

Another Telangana unemployed man on the ground..suicide note shedding tears

0
79

అమ్మా నన్ను క్షమించు..మళ్లీ జన్మంటూ ఉంటే నీ కొడుకుగానే పుట్టాలి. నాకు బతకాలని లేదు. నా చావుకు ఎవరూ కారణం కాదు. నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను నాన్న దగ్గరికి వెళ్లిపోతున్నాను. అంటూ జాబ్​ నోటిఫికేషన్​ కోసం ఎదురు చూసి చూసి.. మనస్తాపం చెందిన ఓ యువకుడి ఆఖరి రాత ఇది.

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎన్నో ఏళ్లుగా శిక్షణ తీసుకుంటూ…ఎప్పటికీ నోటిఫికేషన్​ విడుదల కాకపోవడం వల్ల మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్టలో జరిగింది.

చందంపేట మండలం గువ్వలగుట్టకు చెందిన సపావట్‌ బూర, కమ్మ దంపతులకు ఆరుగురు కుమారులు. వారిలో నాలుగో సంతానం నరేశ్​(30) చిన్నప్పటి నుంచీ చదువులో ముందుండేవాడు. అయిదేళ్ల క్రితం నరేశ్​ తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి పోయిన తర్వాత నరేశ్​ ఉద్యోగ వేటలో పడ్డాడు. అందులో భాగంగా హైదరాబాద్​ వచ్చేసి పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నాడు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్​ విడుదలకాకపోవడంతో ఇక్కడే ఉండిపోయాడు.

ఇటీవల దీపావళికి ఇంటికొచ్చిన నరేశ్​ను ఉద్యోగం రాకుండా, పెళ్లి చేసుకోకుండా ఇలా ఎంతకాలమంటూ…అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు మందలించారు. కుటుంబసభ్యుల మాటలతో మనస్తాపం చెందిన నరేశ్​ శనివారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ నిద్రపోతుండగా గదిలో ఫ్యాన్​కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారంటూ లేఖరాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.