ఇరాక్ ప్రధానమంత్రి ముస్తాఫా అల్-కధామీపై ఆదివారం హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తు ఆయనకు ప్రాణహాని తప్పింది. దుండగులు ఆయన ఇంటిపై డ్రోన్ దాడులకు యత్నించి విఫలమయ్యారు. బాగ్దాద్‌లోని ముస్తాఫా నివాసంపై పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్ దాడికి దుండగులు విఫలయత్నం చేశారని ఇరాక్ సైన్యం తెలిపింది. అయితే ఆయనకు ఎలాంటి హాని జరగలేదని, క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. ఈ దాడులకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పింది.
అయితే ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే బాగ్దాద్‌లో ప్రధాని నివాసం ఉన్న గ్రీన్‌జోన్ ప్రాంతంలో పెద్దఎత్తున కాల్పుల శబ్దం వినిపించిందని ఓ అంతర్జాతీయ మీడియా తన కథనంలో తెలిపింది.