ప్రగతిభవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ..ఇక ధాన్యం సేకరణ చేసేదే లేదని కేంద్రం ఖరాఖండిగా చెప్పింది. అందుకే యాసంగిలో రైతులు వరి పంటలు కాకుండా వేరే పంటలు వేయాలని మంత్రులు సూచించారు.
ప్రస్తుతం 24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. రైతుబందు, రైతుబీమా ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో తప్పా..మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసాం. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాం. రైతుల సంక్షేమమే మా ధ్యేయం. అందుకే వారి కోసం ఎంతో కృషి చేస్తున్నాం. కానీ కేంద్రం పంట కొనుగోలులో తన బాధ్యతను విస్మరించింది. పంట నిల్వ చేసే గోడౌన్ లు కేంద్రం ఆధీనంలో ఉన్నాయి.
రాష్ట్రానికి ప్రత్యేకంగా గోడౌన్ లు లేవు. ఈ ఏడాది 62 లక్షల ఎకరాల్లో వరి వేశారు. కానీ కేంద్రం ఈ ఏడాది ఎంత పంట తీసుకుంటుందో ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. అయినా మేము కొనుగోలు చేస్తాం అని చెప్పి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రికి ఫోన్ చేసినా దీనిపై స్పందించలేదు. ఈ విషయంలో బండి సంజయ్ వరి వేయండి అని రైతులకు చెప్పడం బాధ్యతారాయిత్యాన్ని చూపిస్తుంది.