సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నాం మహబూబ్ నగర్ చేరుకున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ దశ దినకర్మకు సందర్భంగా ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం.. శాంతమ్మ సమాధి వద్ద ఆమెకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని సీఎం కేసీఆర్ పరామర్శించారు.
అయితే శాంతమ్మ సమాధి వద్దకు వెళ్లేందుకు కేవలం వాహనం అనుమతి సి.యం కేసీఆర్ కు మాత్రమే ఉంది. మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా వారికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేసి సమాధి వద్దకు నడుచుకుంటూ పోవాలి. అందరు నిబంధనలు ప్రకారమే నడుచుకున్నారు..కానీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాత్రం తన వాహనాన్ని సమాధి వరకు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు.
పోలీసులు మాత్రం నిబంధనలు కు విరుద్ధంగా వ్యవహరించం అని మర్యాదపూర్వకంగా చెప్పడంతో గువ్వల బాలరాజు నిస్సహాయ స్థితిలో ఉండి పోలీసు అధికారులను ఏంట్రా అని నోరు జారారు. అంతే పోలీసు అధికారులు ఎమ్మెల్యే బాలరాజుకు ఏంట్రా అంటారా మీరు అధికారులకు ఇచ్చే విలువ ఇదేనా అంటూ చుక్కలు చూపారు. తర్వాత బాలరాజు చేసేది ఏమి లేక తన అనుచరులతో కాలి నడకన సమాధి వద్దకు చేరుకున్నారు.
అందుకే పెద్దలు అంటారు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని..హుజూరా బాద్ ఎన్నికల నుండి బాలరాజుకు ఎదో రకంగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పాపం మతి కోల్పోతున్నట్లు ఉంది. ఎమ్మెల్యే గారు కొంచెం ఓపిక పట్టండి. మీ అనుచరులను అన్నట్లు ప్రజలను అధికారులను అంటే ఎవరు ఒప్పుకోరు.