దారుణం..టవల్ ఇవ్వలేదని భార్యను హత్య చేసిన భర్త!

The husband who killed his wife for not giving her a towel!

0
73

మధ్యప్రదేశ్‎లో దారుణం జరిగింది. ఓ 50 ఏళ్ల భర్త స్నానం చేసిన తర్వాత టవల్ ఇవ్వలేదని భార్యను హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాలాఘాట్ జిల్లా కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపూర్ గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నిందితుడు, అటవీ శాఖ దినసరి వేతన ఉద్యోగి రాజ్‌కుమార్ బహే (50) గా గుర్తించారు. రాజ్‌కుమార్ స్నానం చేసిన తర్వాత టవల్ ఇవ్వాలని అతని భార్య పుష్పా బాయి (45)ని అడిగాడు. కానీ ఆమె టవల్ ఇవ్వలేదు. బోళ్లు తోముతున్న కొంతసేపు ఆగమని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ తన భార్య తలపై పారతో పదే పదే కొట్టారని కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర కుమార్ బారియా తెలిపారు. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందిందని చెప్పారు.