స్నేహితుడి భార్యపై కన్నేసిన దుర్మార్గుడు..వీడియోలు తీసి నరకం..

The evil guy who seeks out a friend's wife

0
58

స్నేహానికి మాయని మచ్చ తెచ్చే ఘటన ఇది. స్నేహితుడే కదా అని ఇంటికి రాణిస్తే తన కుటిల బుద్దిని చూపించాడు ఆ దుర్మార్గుడు. పదే పదే ఇంటికి వస్తుంటే మంచి కోరుకునే వాడు కదా అని నమ్మాడు. కానీ ఇంట్లో ఉన్న తన భార్యపైనే కన్నేశాడని కనిపెట్టలేకపోయాడు. హైదరాబాద్‌లో ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. ఏకంగా స్నేహితుడి భార్యపై కన్నేసిన ఓ వ్యక్తి..ఆమెను బెదిరించి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే గాజుల రామారంలోని నెహ్రూ నగర్‌కు చెందిన ప్రశాంత్‌ జీడిమెట్ల భాగ్యలక్ష్మీ కాలనీలో ఉంటున్న..స్నేహితుడి ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ప్రశాంత్ స్నేహితుడి భార్యపై కన్నేశాడు. ప్రేమిస్తున్నానని అంగీకరించకపోతే. చచ్చిపోతాను. లేదంటే చంపుతానంటూ స్నేహితుడి భార్యను ప్రశాంత్‌ తరచూ వేధింపులకు గురిచేశాడు.

ఇలా వివాహితపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను కూడా రికార్డ్‌ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే..వీడియోలు వైరల్ చేస్తా నిన్ను నీ పిల్లల్ని చంపేస్తా అంటూ బెదిరింపులకు గురి చేస్తూ బాధితురాలు నుంచి ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు. ఇక వేధింపులు తట్టుకోలేని బాధితురాలు పేట్‌బషీరాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రశాంత్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇలాంటి ఘటనలు స్నేహితుల మధ్య ఉన్న బంధానికి మాయని మచ్చగా ఉండిపోతాయి. మళ్లీ ఎవరిని నమ్మడానికి అంత సాహసం చేయనివ్వదు ఈ దారుణ ఘటన. ఎవరి బుద్ది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కాబట్టి అందరిని గుడ్డిగా నమ్మకండి. ఆ నమ్మకమే మన ఇంటికి చేటు చేస్తుంది. కాబట్టి ఇతరుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తపడండి.