భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. ‘రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని’ ఐఎండీ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 11 వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని.. ఇప్పటికే వెళ్లినవారు వెంటనే తీరానికి తిరిగి రావాలని సూచించింది. వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండురోజుల పాటు సెలవులను ప్రకటించింది.
Flash News- చెన్నై అతలాకుతలం..రెడ్ అలర్ట్ జారీ
Chennai Atalakutalam..Red Alert issued