హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. మరోసారి మెట్రో రైలు సర్వీసు సమయాల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ మెట్రో సంస్థ. ఇకపై ఉదయం ఆరు గంటల నుంచే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్) వేళల్లో మార్పులు చేసింది.
కొత్త టైంటేబుల్ నేటి నుంచే అమలులోకి రానుంది. ఉదయం 6 గంటలకు తొలి మెట్రో రైలు ప్రారంభం కానుంది. అలాగే రాత్రి 10.15 గంటలకు చివరి స్టేషన్ నుంచి మెట్రో రైలు బయలుదేరి.. రాత్రి 11.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది. మెట్రో సేవలు పొడిగించాలని మంత్రి కేటీఆర్‌ను ఓ ప్రయాణికుడు కోరడంతో దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి.. మెట్రో రైల్ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మెట్రో రైల్ సేవల వేళ్లలో మార్పులు చోటు చేసుకున్నాయి.