‘నాటు నాటు’ సాంగ్ రిలీజ్..డ్యాన్స్ ఇరగదీసిన ఎన్టీఆర్, చరణ్

'Natu Natu' song release..Dance by NTR, Charan

0
87

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ రిలీజైంది. రామ్​చరణ్, ఎన్టీఆర్.. ఊరమాస్ స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. ఈ పాటకు కీరవాణి సంగీతమందించగా, చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. నందమూరి, మెగా హీరో కాంబోలో జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు సినీ పరిశ్రమలో ఇటు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఎప్పుడెప్పుడు తెర మీద చూద్దామా అంటూ అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2922 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి తనదైన స్టైల్ లో సినిమా పై  ఆసక్తిని రేకెత్తించేలా ప్రమోషన్ కార్యక్రమం మొదలు పెట్టాడు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇద్దరూ డ్యాన్స్ లో తమదైన శైలిలో విరదీసేవారే..ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ నుంచి ఇద్దరు హీరోలు కలిసి డ్యాన్స్ చేస్తూ సాగిన ఓ పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీంతో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అంటూ ఓ రేంజ్ లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://www.youtube.com/watch?v=RnuUrwpnZkA