అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు ఆటోను ఢీకొనగా ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నట్లు సమాచారం. కరీమ్గంజ్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.