మార్కెట్‌లో బంగారం ధరల మోత మోగుతోంది. రెండు రోజులు ధర తగ్గితే..నాలుగు రోజులు పెరుగుతోంది. ఇవాళ పసిడి ధర మరోసారి పెరిగింది. వెండి కూడా స్పల్పంగా ఎగబాకింది. మరి బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయి? మార్కెట్‌లో తాజా ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
హైదరాబాద్లో పది గ్రాముల పసిడి ధర రూ.50,540గా ఉంది. కిలో వెండి ధర రూ.67,732 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 10 గ్రాముల బంగారం రేటు రూ.50,540కి, కేజీ వెండి ధర రూ.67,732కు చేరింది.
విశాఖపట్నంలో పది గ్రాములకు పుత్తడి ధర రూ.50,540గా ఉంది. కిలో వెండి ధర రూ.67,732కు పెరిగింది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.