అతనికి బట్ట తల..విగ్గుతో 20 మంది అమ్మాయిలకు వల

He has a cloth head and a net for 20 girls with a wig

0
99

సోషల్ మీడియాలో తానొక NRI అంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇప్పటి వరకు ఆ వ్యక్తి 20 మంది అమ్మాయిలని మోసం చేశాడు. తన వివాహం కాలేదని చెప్పి సోషల్ మీడియాలో విగ్గుతో ఉన్న ఫోటోలు పెట్టిన కార్తీక్ వర్మ. అమ్మాయిలతో పరిచయం పెంచుకొని కొన్నాళ్ల  పాటు సహజీవనం చేస్తాడు. వ్యక్తిగత ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం ఇది కార్తీక్ వంతు.

ఆంధ్ర, తెలంగాణలో ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలు ఈ కంత్రి వలలో చిక్కుకున్నారు. తన పథకంలోని భాగంగా కూకట్పల్లిలోని అమ్మాయిని మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు కార్తీక్ వర్మ . బాధితురాలి ఫిర్యాదుతో కార్తీక్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై పీడీ యాక్ట్ అమలు చేశారు. సోషల్ మీడియాలో పరిచమయ్యే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.