కంగనా రనౌత్ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

CPI Narayana sensational remarks on Kangana Ranaut

0
64

కంగనా రనౌత్ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విలాసవంతమైన బిచ్చగత్తె ఉంటే అది ఈ మధ్య పద్మశ్రీ అవార్డు తీసుకున్న కంగనా రనౌత్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నారాయణ. ఆమెకు స్వాతంత్య్ర పోరాటం గురించి పెద్దగా తెలియదు. ఆ బిరుదు ఇచ్చిన బీజేపీకి అస్సలు  తెలియదు.

1945లో వచ్చిన స్వాతంత్య్రం బిక్ష అని అసలు స్వాతంత్య్రం బీజేపీ వచ్చిన తరువాత 2014లో వచ్చిందని వ్యాఖ్యలు చేయడం దారుణం. ఇంతకంటే బానిసత్వం ఏం ఉంటుంది. నువ్వు అడుక్కోవాలి అనుకుంటే అడుక్కో నాకేమి అభ్యంతరం లేదు. కుష్టి రోగికంటే అంతకంటే మించిన రోగిష్టి కంగనా. ఆమె క్షమాపణ చెప్పి తీరాల్సిందే. లేకుండా నిరసనలకు తెరలేవడం ఖాయం అంటూ నారాయణ అన్నారు. కాగా దీనిపై కంగనా రనౌత్ రియాక్ట్ ఎలా అవుతారో చూడాలి. టైమ్స్ నౌ ఎడిటర్ నావికా కుమార్ కు ఈ నవంబర్ 9 న ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ ఈ వ్యాఖ్యలు చేసింది.