కారుణ్య నియామకాలకు పెళ్లైన మహిళలు కూడా అర్హులే అని కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు కారుణ్య నియామక అర్హతల్లో ‘అవివాహిత’ అనే పదాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటిస్తూ కొట్టివేసింది. ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు కూడా ఓ కేసు విచారణ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది.
తాజాగా ఉత్తర ప్రదేశ్ కూడా ఏపీ, అలహాబాద్ హైకోర్టుల అదే బాటలోనే నడిచింది. కారుణ్య నియామకాలకు సంబంధించి ఓ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉన్నప్పుడు చనిపోతే కారుణ్య నియామకాల కింద ఆ ఉద్యోగాలను పొందేందుకు వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఉద్యోగ నియామకాల శాఖ తీసుకున్న నిర్ణయానికి ఉత్తర ప్రదేశ్ క్యాబినేట్ ఆమోద ముద్ర వేసింది.