షాకింగ్ నిర్ణయం తీసుకున్న అల్లు హీరో

Allu is the hero who made the shocking decision

0
87
Allu Sirish New Okka Kshanam Movie Latest Stylish ULTRA HD Photos Stills Images

కొంతకాలంగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటున్నాడు యువ హీరో అల్లు శిరీష్. ఇక ఇప్పుడు సోషల్​ మీడియాకు గుడ్​బై చెబుతూ అల్లు శిరీష్ షాకింగ్​ నిర్ణయం తీసుకున్నాడు.  ఈ మేరకు ‘నవంబరు 11 నాకు స్పెషల్​ డే’ అంటూ ట్వీట్ చేశాడు.

2021, నవంబరు 11 నా వృత్తిజీవితంలో ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. ఆ విషయం ఏంటో త్వరలో వెల్లడిస్తా. అప్పటివరకు కొన్ని కారణాల వల్ల సోషల్​మీడియాకు దూరంగా ఉంటా” అని ట్వీట్ చేశాడు శిరీష్. ఈ ట్వీట్​ చూసిన నెటిజన్లు పెళ్లి కుదిరిందా?’, హాలీవుడ్​కు వెళ్తున్నారా అంటూ ప్రశ్నలు వేశారు. మరో నెటిజన్​ అడిగిన ప్రశ్నకు..ఇటీవల తాను ఓ కథ విన్నానని ఇది తన కెరీర్​లో బెస్ట్​ స్క్రిప్ట్​ అవుతుందన్నాడు.

ప్రస్తుతం అల్లు శిరీష్​ ‘ప్రేమ కాదంట’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం సిక్స్​ప్యాక్ పెంచి అందరి దృష్టినీ ఆకర్షించాడు శిరీష్​. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్​గా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

https://twitter.com/AlluSirish