చిరిగిన నోట్లను పడేస్తున్నారా? అయితే ఆగండి..కొత్త నోట్లు తీసుకోండిలా..!

Dropping torn notes? But wait..let's take new notes ..!

0
84

కరెన్సీ నోట్లు చిరగడం సాధారణమైన విషయం. వాటిని ఏం చేయాలో తెలియక ప్లాస్టర్‌ లాంటివి అతికిస్తూ ఎవరికో ఒకరికి అంటగట్టడానికి ప్రయత్నిస్తుంటాం. అయితే తీసుకునే వారు ఆ నోటును గమనించి చెల్లవు అంటూ తిరస్కరించే సందర్భాలు కూడా ఉంటాయి. దీంతో చేసేదేమీ లేక నోటును పడేయడమో, నిరుపయోగంగా ఇంట్లోనే ఉంచడమో చేస్తుంటాం. అయితే చిరిగిన నోట్లను బ్యాంకుల్లో ఎక్సేంజ్‌ చేసుకోవచ్చనే విషయం మీకు తెలుసా.? తాజాగా ఈ విషయమై ఎస్‌బీఐ వివరణ ఇచ్చింది.

అమిత్‌ కుమార్‌ అనే ఓ ఖాతాదారుడు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ట్విట్టర్‌ ఖాతాను ట్యాగ్ చేస్తూ.. ‘సార్‌..నా దగ్గర చిరిగిన రూ. 2000 వేల నోటు ఉంది. నేను దానిని రీప్లేస్‌ చేసుకోవాలనుకుంటున్నాను. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ఆధారంగా చిరిగిన నోటును ఎలా మార్చుకోవాలి. దీనికి సంబంధించిన వివరాలను తెలపండి’ అంటూ ఓ పోస్ట్‌ చేశాడు. దీనిపై స్పందించిన ఎస్‌బీఐ సమాధానంగా మరో ట్వీట్ చేసింది. ‘ఎస్‌బీఐకి చెందిన అన్ని రకాల బ్రాంచీల్లో చిరిగిన నోట్లను ఎక్సేంజ్‌ చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతాదారులతో పాటు ఇతరులు కూడా ఇలాంటి నోట్లను మార్చుకోవచ్చు. చెల్లుబాటులో ఉన్న చిరిగిన నోట్లను బ్యాంకులు తీసుకోవచ్చని ఆర్‌బీఐ అనుమతులు ఇచ్చింది.

నోటుకు రెండు వైపులా స్పష్టంగా నెంబర్లు కనిపిస్తూ రెండుగా చిరిగిన నోటునైనా ఎక్సేంజ్‌ చేసుకోవచ్చు. ఇలాంటి నోట్లను ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకు లేదా ప్రైవేటు రంగ బ్యాంకునైనా సంప్రదించి కరెన్సీని ఎక్సేంజ్‌ చేసుకోవచ్చు. దీని కోసం ఎలాంటి అప్లికేషన్‌ ఫామ్‌ను నింపాల్సిన అవసరం లేదు. ఈ విషయం ఆర్.బిఐ విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉంది కూడా.