తన ప్రేమ విషయంలో అడ్డొచ్చాడని కన్న తండ్రినే హత్య చేయించింది కసాయి కూతురు. జూలై 20న జరిగిన గ్యాస్ ఏజెన్సీ ఉద్యోగి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి బాలికే కన్న తండ్రిని హత్య చేసినట్లు నిర్ధారించారు.
కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మన్ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం..కాప్రాకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి భార్య, కూతురు ఉన్నారు. ఆ యువతి భూపాల్ అనే యువకుడితో ప్రేమలో ఉంది. విషయం తెలిసిన బాలిక తండ్రి పలుమార్లు మందలించారు. ఈ క్రమంలో భూపాల్ ఆ బాలికకు మాయమాటలు చెప్పి.. రామకృష్ణ ఇంట్లో రూ.1.75 లక్షలు చోరీ చేశాడు. ఖరీదైన బైక్, సెల్‌ఫోన్, బట్టలు కొనుక్కొని మైనర్ బాలికతో జల్సాలు చేశాడు. దీనిపై రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు భూపాల్‌ను రిమాండ్ తరలించారు.
భూపాల్ విడుదలవ్వగా మన ప్రేమకు తండ్రి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. జూలై 19న ఇంట్లో వాళ్లందరికీ భోజనంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. అందరూ మత్తులోకి జారుకున్నాక సుమారు 2 గంటల ప్రాంతంలో ఆమె ప్రియుడు భూపాల్, తన స్నేహితులతో కలిసి ఇంట్లోకి వచ్చి బాలిక తండ్రిని గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లగా శరీరంపై గాయాలు బయటపడడంతో పోలీసులు హత్యగా నిర్ధారించారు. ఆయన భార్యను విచారించగా తన కూతురు నారాయణగూడలోని భూపాల్ పై అనుమానం వ్యక్తం చేసింది. దీనికి గాను రూ.2 లక్షలు సుఫారి ఒప్పందం చేసుకున్నారు. విచారణలో భాగంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చింది. దీనితో భూపాల్ తో పాటు అతని స్నేహితులైన ప్రశాంత్, గణేష్, విజయ్ భూపాల్ ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు.