హైదరాబాద్: మణికొండలో దొంగలు రెచ్చిపోయారు. ఇంటి తాళం పగలగొట్టి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి హరిబాబు ఇళ్లును గుళ్ల చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇంట్లోని అల్మారాలో ఉన్న 23 తులాల బంగారం, 50 వేల నగదు అపహరించినట్లు బాధితుడు తెలిపాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళాడు హరిబాబు. రాత్రి ఇంటికి వచ్చే సరికి మెయిన్ డోర్ తాళం పగలగొట్టి కనిపించడంతో దొంగతనం జరిగిందని గుర్తించి..వెంటనే నార్సింగీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. రంగంలోకి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు దింపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.
మణికొండలో రెచ్చిపోయిన దొంగలు
Provoked thieves in Manikonda