మావోయిస్ట్ అగ్ర నాయకుడు ఆర్కే జీవిత చరిత్ర పుస్తకం ప్రింటింగ్ కేసు దర్యాప్తు షురూ అయింది. నవ్య ప్రింటింగ్ ప్రెస్ పై తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు. ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ అయిన వెయ్యి బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. నవ్య ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణ రెడ్డిని 41 CRPC కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు. రామకృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో నోటీసులు ఇచ్చి విడుదల చేశారు.