మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందారు. బాణం బాంబులను పరిశీలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు రవి మృతి చెందినట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన విడుదల చేసింది. మావోయిస్టు కేంద్ర కమిటీలో టెక్నికల్ టీం కు సభ్యులుగా రవి ఉన్నారు. అయితే రవి చనిపోయిన సంవత్సరన్నర తర్వాత మావోయిస్టు కేంద్ర కమిటీ ఈ ప్రకటన చేసింది.
నెల్లూరు జిల్లాకు చెందిన కామ్రేడ్ రవి. జూన్ 5 2020లో మృతి చెందాడు. జూన్ 26 2020లో విప్లవ లాంఛనాలతో రవి అంత్యక్రియలు జరిపిన మావోయిస్టు పార్టీ. జార్ఖండ్లో ఈ ఆర్ బి స్టాప్ గా పని చేసిన రవి టెక్నికల్ పర్సన్ గా, కంప్యూటర్ ఆపరేటర్ గా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ లో దిట్ట. అత్యాధునిక ఐఈడిలు అమర్చడంలో ఆరితేరిన రవి. పిఎల్జిఏకు కొత్త ఆయుధాలు సమకూర్చడంలో కీలక పాత్ర పోషించాడు.