Breaking News- టీఆర్ఎస్ మహధర్నాకు పోటీగా రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

Rewanth Reddy's sensational decision to contest for TRS Mahadharna

0
78

తెలంగాణ గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకుల సమావేశం ముగిసింది. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరికి నిరసనగా ఈనెల 18న హైదరాబాద్ లో టీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించనున్నారు. ఈ మేరకు గులాబీ బాస్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని చెప్పారు.

ఇప్పుడు ఈ ధర్నాకు పోటీగా పీసీసీ చీఫ్ రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం కొనే వరకు ఉద్యమిద్దాం అంటూ..18న పబ్లిక్ గార్డెన్ నుంచి ఉదయం 11 గంటలకు వ్యవసాయ కమిషనరేట్ వరకు నిరసన ప్రదర్శన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని రేవంత్ రెడ్డి కోరారు.