నిరుద్యోగులకు శుభవార్త..టెన్త్‌ అర్హతతో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే

0
99

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. టెన్త్‌ అర్హతతో పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలకు నోటిషికేషన్‌ విడుదలైంది. స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఏపీ పోస్టల్ సర్కిల్ పేర్కొంది. దీని ద్వారా సుమారు 75 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తి కానున్నాయి.

ఇందులో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్/రీజనల్ ఆఫీస్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, పోస్ట్ మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితర పోస్టులున్నాయి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

కావాల్సిన విద్యార్హతలు:

పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్సిటీ నుంచి ఇంటర్ పాసై ఉండాలి.

పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు 12వ తరగతి పాసై ఉండాలి. స్థానిక భాష అయిన తెలుగుపై నాలెడ్జ్ ఉండాలి. టెన్త్ వరకు తెలుగును ఓ సబ్జెక్టుగా చదివి ఉండాలి.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. స్థానిక భాష తెలుగుపై నాలెడ్జ్ ఉండాలి. టెన్త్ వరకు తెలుగు ఓ సబ్జెక్ట్ గా ఉండాలి. మిగిలిన వివరాలను నోటిఫికేషన్లో చూడవచ్చు.