ఏపీలో మరో ఎన్నికల ఫలితాల వేడి రాజుకుంది. తాజాగా జరిగిన మున్సిపల్ నగర పంచాయితీల్లో గెలుపెవరిదీ? ఓటమి ఎవరిదన్న ఉత్కంఠకు మరి కాసేపట్లో తెరపడబోతోంది.
అయితే తాజా సమాచారం ప్రకారం చంద్రబాబు కంచు కోట కుప్పంను వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 24 వార్డులకు గాను ఇవాళ్టి ఓట్ల లెక్కింపులో 13 మంది వైసిపి అభ్యర్థులు గెలిచారు. టీడీపీ అభ్యర్థులు 2 వార్డుల్లో గెలుపొందారు. మరోవైపు 11వ వార్డులో రీకౌంటింగ్ కొనసాగుతుంది.