అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే ‘శ్యామ్ సింగ రాయ్’..ఆసక్తికరంగా టీజర్

0
72

నాని ‘శ్యామ్​సింగరాయ్’ టీజర్ వచ్చేసింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉన్న ఈ టీజర్ సినిమాపై అంచనాల్ని తారా స్థాయికి చేర్చింది. ఇందులోని నాని రెట్రో లుక్​ ఫ్యాన్స్​ పండగ చేసుకునేలా ఉంది. ‘స్త్రీ ఎవడికీ దాసి కాదు. ఆఖరికి ఆ దేవుడికి కూడా. ఖబద్దార్’ అంటూ బెంగాలీలో నాని చెప్పిన డైలాగ్.. ఆకట్టుకుంటోంది.

అడిగే అండ లేదు కలబడే కండలేదు రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే.. కాగితం కడుపు చీల్చుకుపుట్టి రాయడమే కాదు. కాలరాయడం కూడా తెలుసనీ అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే శ్యామ్ సింగ రాయ్ అంటూ చెప్పిన డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈసినిమాలో సాయి పల్లవి రోల్ చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు.

అంతే కాదు ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రకు అతీత శక్తులు కూడా ఉంటాయని టాక్ వినిపిస్తుంది.  ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమా మాత్రం థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. దాంతో నాని ఈ సినిమాతో హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. డిసెంబర్ 24న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

టీజర్ చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.youtube.com/watch?v=3YGqoG3engk&feature=emb_title