రాజ్ భవన్ ఎదుట టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

TRS activist commits suicide in front of Raj Bhavan

0
80

సీఎం కేసీఆర్​ దేవుడి లాంటి వ్యక్తి అని..తమ నాయకుడిని విమర్శిస్తున్నారనే ఆవేదనతో రాజ్​ భవన్​ ఎదుట టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించారు. రాజ్​భవన్ ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్​లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్​ వద్ద సీఎం కేసీఆర్​ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. మహా ధర్నా అనంతరం తెరాస బృందం గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​కు వినతిపత్రం ఇవ్వడానికి బయలుదేరారు.

ఆ సమయంలో వారి వాహనాలు వచ్చే ముందు సూర్యాపేట జిల్లాకు చెందిన నాగార్జున అనే తెరాస కార్యకర్త..అకస్మాత్తుగా రాజ్ భవన్ ఎదుట రోడ్డుపైకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అడ్డుకున్నారు.